రెండవ దశ కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో వార్డుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు. గాంధీ ఆస్పత్రిలోని అన్ని వార్డులతో సహా క్యాంటీన్ పరిసర ప్రాంతాలలో కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను స్ప్రే చేశారు.
గాంధీ ఆసుపత్రిలో రసాయన పిచికారీ - covid precautions in hospitals
కరోనా రోజురోజుకూ తీవ్రమవుతుండగా.. హైదరాబాద్ నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో వార్డుల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేశారు.
గాంధీ ఆస్పత్రిలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ
గాంధీని పూర్తిగా కోవిడ్ ఆస్పత్రి చేసిన తర్వాత రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫెక్షన్ ఎక్కువగా కాకుండా ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండో దశ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని గాంధీ వైద్యులు సూచిస్తున్నారు.