ఏపీలోని విశాఖలో ఎస్సీ యువకుడికి శిరోముండనం కేసులో నిందితుడైన నూతన్ నాయుడు ఇద్దరికి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఏకంగా రూ.12 కోట్లకు టోకరా వేయటంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
విశాఖ జిల్లా రావికమతం ప్రాంతానికి చెందిన నూకరాజు, తెలంగాణలోని చేవెళ్లకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి మిత్రులు. హైదరాబాద్‌లో నూకరాజు సీసీకెమెరాలు, శ్రీకాంత్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేసేవారు. లావాదేవీల్లో భాగంగా నూతన్‌నాయుడితో వారికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో వారికి ఎస్‌బీఐలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికాడు. ఆ బ్యాంకులో దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ పోస్టు కోసం శ్రీకాంత్‌రెడ్డి రూ.12 కోట్లు, ఉద్యోగం కోసం నూకరాజు రూ.5 లక్షలు చెల్లించారు. రెండేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో తాము మోసపోయామని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు.