ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆన్లైన్ నామినేషన్లకు అనుమతించటంతో పాటు కేంద్ర భద్రతా దళాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. పార్టీ ముఖ్యనేతలతో ఆన్లైన్లో సమీక్షించారు.
ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు - Chandrababu latest news
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఆన్లైన్ ద్వారా సమీక్ష నిర్వహించిన చంద్రబాబు... గతంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
CHANDRA BABU
గత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో వైకాపా బెదిరింపులకు పాల్పడి, తప్పుడు కేసులు పెట్టి బలవంతంగా విత్డ్రా చేయించిందని ఆరోపించారు. ఈ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఎస్‌ఈసీ ఇటీవల వివిధ పార్టీలతో నిర్వహించిన సమావేశంలోనూ... మెజారిటీ పార్టీలు అవే అభిప్రాయాలను వెల్లడించాయని గుర్తుచేశారు.