తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రానికి చల్లని కబురు.. నేడు, రేపు అక్కడక్కడ జల్లులు! - Telangana weather news

Telangana weather update: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్రానికి వాతావరణ కేంద్రం చల్లని కబురందించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Chance to rains on today and tomorrow in some places of telangana
Chance to rains on today and tomorrow in some places of telangana

By

Published : Jun 8, 2022, 4:54 PM IST

Telangana weather update: రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రేపు ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది. నిన్న తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు ఛత్తీస్​ఘడ్​ నుంచి కోస్తా తీరం వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details