Centre On AP Govt Loans: ఎఫ్ఆర్‌బీఎం పరిధికి మించి ఏపీ రుణాలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. పరిమితికి మించి రూ.17,924 కోట్ల రుణాలు పొందినట్లు పేర్కొంది. ఫలితంగా వచ్చే మూడేళ్లలో రుణ సేకరణపై ఆంక్షలున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎంపీలు కేశినేని, రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ జవాబునిచ్చింది. అధికంగా తీసుకున్న రుణాలను మూడేళ్లలో సర్దుబాటు చేసేలా ఏపీకి అవకాశమిచ్చామని తెలిపింది. ఎఫ్ఆర్‌బీఎం కన్నా తక్కువ రుణాలు తీసుకోవాలని ఆంక్షలు కూడా విధించినట్లు ప్రస్తావించింది.
వాటి కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం : కేంద్రం
centre on Kakinada - Srikakulam Gas Pipeline: కొవిడ్ కారణంతో పాటు వర్షాల కారణంగా కాకినాడ- విశాఖ - శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ.. రాజ్యసభకు తెలిపింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు.. పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు 2014 జూలై 16న.. ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను అనుమతించినట్లు మంత్రి చెప్పారు. కేఎస్‌పీఎల్ పైప్ లైన్ ప్రాజెక్ట్‌లోని కాకినాడ-వైజాగ్ సెక్షన్‌ను 2021 జూన్ 30 నాటికి, వైజాగ్-శ్రీకాకుళం సెక్షన్‌ను 2022 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కానీ కొవిడ్ మహమ్మారి విజృంభణ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం ప్రస్తావించారు.