దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్, చికిత్స కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ కూడా వ్యాక్సిన్ లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని... వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దేశంలో వేగంగా కరోనా వ్యాక్సినేషన్ : కిషన్ రెడ్డి - telangana varthalu
టీకా తీసుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని ఆయన అన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మంత్రి సందర్శించారు.
భారత్ నుంచి మరో 58 దేశాలకు కొవిడ్ టీకా సరఫరా అవుతోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. దేశీయంగా అవసరమైన డోసులు అందుబాటులో ఉంచామన్నారు. టీకా తీసుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాలని... ప్రజల సహకారం లేకుండా కొవిడ్‌ను అరికట్టలేమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయన్నారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా టీకా తీసుకునే వారి సంఖ్య పెరిగిందని... ఎక్కువమంది రావడం వల్లే డోసుల పంపిణీలో ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. కొవిడ్ టీకాల ఉత్పత్తి మరింత పెరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 2,478 కరోనా కేసులు.. 5 మరణాలు