తెలంగాణ

telangana

ETV Bharat / city

Kishan Reddy: 'బడుగు, బలహీనవర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి మోదీ' - తిరుపతిలో జనఆశీర్వాద సభ

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో పర్యటిస్తున్నారు. కేబినేట్ మంత్రి అయ్యాక మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్​కు వచ్చారు. తిరుపతిలో తలపెట్టిన “జన ఆశీర్వాద యాత్ర”లో ఆయన పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో బహిరంగ సభతో యాత్ర ముగిసింది.

central
జన ఆశీర్వాద యాత్ర

By

Published : Aug 18, 2021, 9:56 PM IST

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేబినేట్ మంత్రి అయ్యాక మొదటి సారిగా ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో “జన ఆశీర్వాద యాత్ర” ప్రారంభించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో బహిరంగ సభతో యాత్ర ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు గన్నవరం చేరుకుని భారీ ర్యాలీతో విజయవాడలోని వెన్యూ హాలుకు చేరుకుని అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత నగరంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. భోజనానంతరం దుర్గమ్మను దర్శించుకుని ఖమ్మం వెళ్లనున్నారు.

పేదవారి కష్టాలు తెలిసిన నాయకుడు మోదీ..

శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు పలు కేంద్ర విద్యాసంస్థలు నిర్మించాం. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత ప్రధాని మోదీది. బడుగు, బలహీనవర్గాల కష్టాలు ప్రధానికి తెలుసు. అందుకే పేదవారికి బ్యాంకు ఖాతాలు ఉండాలని జీరో బ్యాలెన్స్, ష్యూరిటీ అవసరం లేకుండానే కోట్లమందికి ఖాతాలు ఇచ్చాం. 27 మంది బీసీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది ఎస్సీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించాం.

-- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

'బడుగు, బలహీనవర్గాల కష్టాలు తెలిసిన వ్యక్తి మోదీ'

ఇదీ చదవండి:రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details