తెలంగాణ

telangana

ETV Bharat / city

CENTRAL ON PROJECTS DPR IN AP: ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందే: కేంద్రం

Central clarified on DPR in AP : కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు మినహా మిగిలినవి బోర్డు పరిధిలో అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్‌ వాదనను కేంద్రం తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. పోతిరెడ్డిపాడు దిగువన  బనకచర్ల, వెలిగోడు, గోరకల్లు, అవుకు రిజర్వాయరుసహా అన్నీ బోర్డు పరిధిలో ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్రం లేఖ రాసింది.

CENTRAL ON PROJECTS DPR IN AP, ap projects
ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందే

By

Published : Dec 26, 2021, 2:54 PM IST

Central government clarified on DPR under the Board: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందేనని కేంద్ర జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి...కేంద్ర జల్‌శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ అవస్తి కొద్ది రోజుల క్రితం లేఖ రాశారు. బోర్డు పరిధిపై ఏపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు అంశాల వారీగా సమాధానం ఇచ్చిన కేంద్రం… దేనితోనూ ఏకీభవించలేదు. పూర్తిగా బోర్డు పరిధిలో ఉండే షెడ్యూలు-2లో ప్రధాన ప్రాజెక్టులైన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఉంటే చాలనడం సరికాదని..పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ.. బోర్డుల పరిధిలో ఉండాలని తేల్చి చెప్పింది. శ్రీశైలం నీటి నిల్వలు తగ్గినపుడు పోతిరెడ్డిపాడు కాకుండా వెలిగోడు, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్, గోరకల్లు, అవుకు ఇవన్నీ ముఖ్యమని అన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందేనని పేర్కొంది.

Central govt on DPR in AP: ప్రాజెక్టుల పేర్లు పునర్విభజన చట్టంలో ఉన్నట్లే బోర్డు పరిధి నోటిఫికేషన్‌లో చేర్చామని... వీటిని మార్చాలంటే పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. గాలేరు-నగరి, సిద్దాపురం ఎత్తిపోతల , కోయిల్‌సాగర్‌కు సంబంధించిన ఫిర్యాదుపైనా స్పందించింది. తుంగభద్ర కుడిగట్టు దిగువ, ఎగువ కాలువలు తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నందున వీటిని కృష్ణా బోర్డు పరిధి నుంచి తొలగించాలన్న ప్రతిపాదనకూ అంగీకరించలేదు. భైరవానితిప్ప, గురురాఘవేంద్ర, గాజులదిన్నె విషయంలోనూ ఏపీ అభిప్రాయంతో విభేదించింది. మునేరు ప్రాజెక్టు ఆనకట్ట పురాతనమైందని, బచావత్‌ ట్రైబ్యునల్‌ 3.3 టీఎంసీలు కేటాయించిందని కాబట్టి దీన్ని ఆమోదం లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని కోరగా... రిజర్వాయర్ ఎక్కువగా తెలంగాణలో ఉన్నందున అంతర్రాష్ట్ర సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది ఆమోదం లేనిదేనని సమాధానమిచ్చింది.

Projects dpr under the River Boards: పోలవరం కుడి కాలువకు, నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు సంబంధం లేనందున దీన్ని నోటిఫికేషన్‌ నుంచి తొలగించాలని ఏపీ కోరగా.. పోలవరం డీపీఆర్​(DPR) ప్రకారం కుడికాలువ నుంచి సాగర్‌ ఎడమకాలువ చివరి ఆయకట్టుకు నీరందుతుందని.. అందుకే చేర్చినట్లు వివరించింది. కృష్ణాపై ప్రకాశం బ్యారేజీ, గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీల వద్ద వచ్చే నీటిని.. విడుదల చేసే నీటిని రికార్డు చేయడమే కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్‌ యాజమాన్యంలో ఉండేలా మార్చాలన్న సూచనకు అంగీకరించలేదు. వైకుంఠాపురం పంపింగ్‌ స్కీంకు బచావత్‌ ట్రైబ్యునల్‌ 2.6 టీఎంసీలు కేటాయించిందని, ఇందులో 0.6 టీఎంసీలు హైదరాబాద్‌ తాగునీటికి పునఃకేటాయించారని ఈ పథకం అమరావతి తాగునీటి అవసరాలు తీరుస్తున్నందున షెడ్యూలు-1, 3లో చేర్చాలని ఏపీ కోరగా దాన్నీ కేంద్రం తిరస్కరించింది.

ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలో ఉండాల్సిందే

ఇదీ చదవండి:komuravelli mallanna kalyanam 2021 : కమనీయం.. కోరమీసాల మల్లన్న కల్యాణం..

ABOUT THE AUTHOR

...view details