'కార్మికులారా... మీ వెనుక మేమున్నాం' - telangana rtc employees strike
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే... సకల ఉద్యోగుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోందని తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు అని వాటిని ప్రభుత్వాలు కాలరాయడం సరైంది కాదని ఆసంఘం అధ్యక్షుడు దానకర్ణచారి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాన్ని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని, వారి వెనుక ఉద్యోగులంతా ఉన్నారని ఆయన భరోసా కల్పించారు.
- ఇదీ చూడండి : పదమూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె