మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మూడో రోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందులలో ఉన్న సీబీఐ అధికారులు... వివేకా హత్య కేసుపై ఆరా తీస్తున్నారు. పులివెందుల రింగు రోడ్డు పరిసర ప్రాంతాలను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను పరిశీలించారు. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు పిటిషన్ అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పిటిషన్ మూడు రోజుల తర్వాత తెరిచే వీలుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
వివేకా హత్యకేసు: పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఏపీ కడప జిల్లా పులివెందులలో మకాం వేసిన సీబీఐ అధికారులు మూడో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు విషయమై పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ మూడు రోజుల తర్వాత తెరిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివేకా హత్యకేసు: పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్
ఆ పిటిషన్లో ఏ వివరాలు ఉన్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసులో ముఖ్యులను విచారించడానికా... లేక కోర్టు అనుమతితో ఎవరినైనా ప్రశ్నించడానికి పిటిషన్ వేశారా అనేది తెలియాల్సిఉంది.
ఇదీ చదవండి :'స్వర్ణ ప్యాలెస్ కేసులో ఛైర్మన్‌ను కస్టడీలోకి తీసుకోవద్దు'