CBI ENQUIRY RESTARTS ON VIVEKA MURDER : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. 6 నెలల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ విచారణ చేపట్టారు. ఏపీలోని పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ సమక్షంలో అనుమానితులను ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఇనయతుల్లాను సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది.
2019 మార్చి 19న రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని మొదటగా ఫోటోలు వీడియోలు తీసింది ఇనయాతుల్లానే. ఆ వీడియోలను ఇతరులకు తన మొబైల్ ద్వారానే పంపాడు. ఈ విషయంపైనే సీబీఐ అధికారులు అతన్ని విచారించినట్లు సమాచారం. హత్య జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు.. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని ఎవరు శుభ్రం చేశారనే దానిపైన సుదీర్ఘంగా ప్రశ్నించారు. గతంలో కూడా అనేకమార్లు సీబీఐ అధికారులు.. అతన్ని విచారణకు పిలిచారు.
YS VIVEKA CASE UPDATE : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్టున్నారని.. సాక్షులను బెదిరిస్తున్నారని సునీత తరపు సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.