అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిందంటూ.. సాక్షి వెబ్ మీడియాలో(Contempt petition on Sakshi web) ట్వీట్ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuram Krishnaraju) దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్(Contempt petition filed by MP Raghuram )పై సీబీఐ కోర్టు(cbi court) నేడు విచారణ చేపట్టనుంది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 25న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉదయం 10 గంటల 50 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాదనలు కొనసాగాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషనర్ అంతకుముందు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారని సాక్షి వెబ్ మీడియాలో ట్వీట్ చేశారని పేర్కొన్నారు. దాన్ని చూసి సంబురాలు చేసుకున్నారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని.. అందువల్ల దీన్ని కోర్టు ధిక్కరణ(Contempt) కింద పరిగణించాలని కోరారు.
సాక్షి ప్రతినిధుల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఇస్తేనే కోర్టు ధిక్కరణ వర్తిస్తుందని చెప్పారు. వార్తా సేకరణలో భాగంగా పలు రకాలుగా వార్తలు అందుతుంటాయని, వాటిని ధ్రువీకరించుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో ఉన్న ఉద్యోగి ధ్రువీకరించుకోకుండా వార్తను ఇచ్చారని.. ఈ కారణంగా రాజీనామా చేశారన్నారు. అనంతరం గంటలోపే ఆ సమాచారాన్ని తొలగించడంతో పాటు తప్పుగా ఇచ్చినందుకు చింతిస్తున్నామని చెప్పామని.. అయినా ఆ విషయాన్ని పిటిషనర్ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్దేశపూర్వక ఉల్లంఘన కాదని అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై తదుపరి విచారణ నేటికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా కోర్టు ధిక్కరణ కేసులో ప్రతివాదులైన సాక్షి ఎడిటర్ మురళీ, సీఈఓ వినయ్ మహేశ్వరి హాజరయ్యారు.