ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెర్ఫుజ్ అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా వారం రోజులు సమయం ఇవ్వాలని కోర్టును సీబీఐ న్యాయవాది గోపీనాథ్ కోరారు.
మంత్రి సబితా డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌కు గడువు కోరిన సీబీఐ
ఓబుళాపురం గనుల అక్రమాల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 29కి వాయిదా వేసింది.
sabitha
ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30న ఉన్నదని.. అప్పటి వరకు కేసు వాయిదా వేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మెమో దాఖలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లపై అభియోగాల నమోదుపై విచారణను సీబీఐ కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి :లోన్‌యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో స్పందించిన ఆర్‌బీఐ