మూతపడ్డ సామిల్లులను వెంటనే తెరిపించాలంటూ... హైదరాబాద్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్ ముందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించిన వారు ముఖ్యమంత్రి, అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వాడుకకు ఆదేశించిన 44 రకాల చెట్ల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
మూతపడ్డ సామిల్లులను వెంటనే తెరిపించాలంటూ ఆందోళన
హైదరాబాద్‌లోని అరణ్య భవన్ ముందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. మూతపడ్డ సామిల్లులను వెంటనే తెరిపించాలంటూ డిమాండ్ చేశారు.
మూతపడ్డ సామిల్లులను వెంటనే తెరిపించాలంటూ ఆందోళన
విశ్వబ్రాహ్మణ కార్పెంటర్లకు లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి... అటవీశాఖ వేధింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే... లక్షమందితో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి: బాతిక్ బ్రహ్మ బాలయ్య కన్నుమూత.. కేసీఆర్ సంతాపం