తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​లో పేదలకు అండగా కేర్‌ అండ్‌ షేర్‌ ఫౌండేషన్‌

పదిమందికి సాయం చేయాలనే తత్వమే అతడిని సేవా మార్గం వైపు నడిపించింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఓ ఎన్జీవోను స్థాపించాడు. కరోనా కష్టకాలంలోనూ కార్మికులు, నిరాశ్రయులకు అన్నం పెడుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన సురేశ్.

care and share, care and share ngo, care and share ngo in Hyderabad
కేర్ అండ్ షేర్, హైదరాబాద్​లో కేర్ అండ్ షేర్, కేర్ అండ్ షేర్ ఎన్జీవో

By

Published : May 14, 2021, 10:16 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. పనుల్లేక పస్తులుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేశ్‌..ఎంబీఏ పూర్తి చేసి... పేదలకు సహాయం చేయడానికి కేర్‌ అండ్‌ షేర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. దాతల నుంచి విరాళాలు సేకరించి పేదవారికి, అనాథలకు తన ఎన్జీవో ద్వారా సాయం అందిస్తాడు. ఈ సంస్థ ద్వారా కరోనా తొలి దశ నుంచి ఇప్పటి వరకు పేదలకు, కార్మికులకు, రోడు పక్కన ఉండే సాయం చేస్తున్నాడు.

లాక్​డౌన్​లో పేదలకు అండగా కేర్‌ అండ్‌ షేర్‌

ఈ కేర్‌ అండ్‌ షేర్‌ ఫౌండేషన్‌లో దాదాపు 40 మందికి పైగా సభ్యులు ఉన్నారు. మురికివాడల్లో నివసించే నిరుపేదలకు నిత్యావసరాలు అందించేవాడు. హైదరాబాద్​లో లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి.. రోడ్డు పక్కన ఉండే వారికి అన్నం, మాస్కులు అందిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా అభాగ్యులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తున్నాడు. ఆంక్షలు అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు ఆహారం, ఓఆర్​ఎస్ అందిస్తోంది.. కేర్‌ అండ్‌ షేర్‌ సంస్థ.

ఆకలితో అలమటించే నిరుపేదల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తానని చెబుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details