ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్ మట్టయ్య కథనం ప్రకారం... ఈస్ట్ మారేడుపల్లి రోడ్డులోని సెకండ్ లక్ష్మీనగర్‌కు చెందిన మురళీకృష్ణ, లక్ష్మి దంపతులకు కుమారుడు రవిచైతన్య, కుమార్తె ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన రవిచైతన్య(21) బేగంపేట్‌లోని కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మారేడుపల్లిలో ఉండే యువతిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడం వల్ల మనస్తాపానికి గురై.. ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చిన అతని చెల్లెలు తలుపులను ఎంత తట్టినా తీయలేదు. ఆమె స్థానికుల సహాయంతో తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతున్నాడు. స్థానికులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రేమ విఫలమైనందు వల్లనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మురళీకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రేమ విఫలమైందని కాల్‌సెంటర్ ఉద్యోగి ఆత్మహత్య - sucide
ఈస్ట్ మారేడుపల్లికి చెందిన 21 ఏళ్ల రవిచైతన్య ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీ బిగించి ఉరి వేసుకున్నాడు.
ప్రేమ విఫలమైందని కాల్‌సెంటర్ ఉద్యోగి ఆత్మహత్య