తెలంగాణ

telangana

ETV Bharat / city

పేదలకు అండగా కల్వరి టెంపుల్​ వ్యవస్థాపకులు - కల్వరి టెంపుల్​

వలసకూలీలు, నిరుపేదలకు ఆదుకునేందుకు కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకులు సతీశ్​కుమార్ ముందుకు వచ్చారు. ఆహారంతో పాటు రూ.రెండు కోట్ల వరకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

calavari temple satesh donate rs.2 crores
పేదలకు అండగా కల్వరి టెంపుల్​ వ్యవస్థాపకులు

By

Published : Apr 1, 2020, 7:02 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతుండడంతో వలసకూలీలు, నిరుపేదలకు ఉపాధి కరువైంది. ఇలా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకులు సతీశ్​కుమార్ ముందుకు వచ్చారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి టెంపుల్ పరిసరాల్లో నివాసముంటున్న వారికి నిత్యావసర వస్తువులు, మాస్క్‌లు అందించినట్లు తెలిపారు. పేదలకు ఆహారంతో పాటు రూ. 2కోట్ల వరకు సహాయం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు మందులు నిత్యావసర సరుకులు అందించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

పేదలకు అండగా కల్వరి టెంపుల్​ వ్యవస్థాపకులు

ABOUT THE AUTHOR

...view details