తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. 12 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చలు జరిపారు. కరోనాను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచామని, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ వివరించారు.
కరోనా అదుపులో తెలంగాణ భేష్ : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ - తెలంగాణ తాజా వార్తలు
రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం కరోనాను చాలావరకు అదుపు చేయగలిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 12 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష జరిపారు.
కరోనా అదుపులో తెలంగాణ భేష్ : కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల్లో కొవిడ్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో టెస్టులు చేయడాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి అభినందించారు.
ఇదీ చదవండిఃసేంద్రీయ సేద్యంపై.. సర్కారు ప్రత్యేక దృష్టి!