తెలంగాణ

telangana

ETV Bharat / city

నిందితుల గుండెల్లో దిగిన తూటాలు - ploice bullets

దిశ నిందితుల ఎన్​కౌంటర్​లో మృతి చెందిన నలుగురి మృతదేహాల నుంచి మొత్తం 12 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడి చేసే క్రమంలో నిందితులు రెండు తుపాకులతో పాటు కర్రలు, ఇటుకలు, రాళ్లు వాడినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

నిందితుల గుండెల్లో దిగిన తూటాలు
నిందితుల గుండెల్లో దిగిన తూటాలు

By

Published : Dec 7, 2019, 8:57 AM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​లో మొత్తం 12 తూటాలను గుర్తించారు. ఒక్కొ మృతదేహానికి 10 అడుగుల దూరం ఉంది. ఏ1 నిందితుడు ఆరిఫ్​ మృతదేహంలో నాలుగు తూటా గాయాలున్నాయి. అతడి ఛాతీకి కుడి ఎడమవైపుల్లో ఒక్కోటి చొప్పున, డొక్క, కడుపులోకి మరో రెండు తూటాలు దూసుకెళ్లాయి.

మరో నిందితుడు జొల్లు శివ కుడివైపు ఛాతీ, మెడ, కడుపుల్లో తూటా గాయాలను గుర్తించారు.

జొల్లు నవీన్​ కణత, ఛాతీ నుంచి తూటాలు దూసుకెళ్లాయి. అతడి దుస్తులు రక్తంతో తడిసిపోయాయి.

చింతకుంట చెన్నకేశవులు ఛాతీ, కడుపు, ఎడమ భుజానికి ఈ గాయాలున్నాయి.

13 ఆయుధాల గుర్తింపు

పోలీసులపై దాడి చేసేందుకు నిందితులు, రెండు తుపాకులతో పాటు కర్రలు, ఇటుకలు, రాళ్లు ఉపయోగించారు.

ABOUT THE AUTHOR

...view details