ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం గరుడ కండిలో పెళ్లింట విషాదం నిండింది. గ్రామానికి చెందిన దమయంతి అనే నవ వధువు శనివారం ఉదయం గుండె పోటుతో మృతి చెందింది. నదిగాం మండలం తురకలకోటకు చెందిన సురేష్తో నవంబర్ 28న ఆమెకు వివాహం జరిగింది. నవంబర్ 30 తెల్లవారుజామున గుండె పోటుతో ఆమె చనిపోయింది. అప్పటికి ఆమె తన కన్నవారి ఇంట్లో ఉంది. తాళి కట్టిన 48 గంటల్లోనే తన భార్యకు తల కొరివి పెట్టవలిసివచ్చిందని భర్త శోకసంద్రంలో మునిగిపోయాడు. తమ బిడ్డ ఇక లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..! - latest news on heart attack deaths in garudakandi
ఆ వధువు కాళ్ల పారాణి ఇంకా ఆరనే లేదు. ఇంట్లో పెళ్లి సందడి తీరనే లేదు. ఇంతలోనే విధి కన్నెర్ర చేసింది. వివాహమైన 48 గంటల్లోనే నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తుందనుకున్న సమయంలో మృత్యు ఒడికి చేరడాన్ని జీర్ణించుకోలేని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయ విదాకర ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గరుడ కండిలో జరిగింది.
పెళ్లై 48 గంటలే.. అంతలోనే వధువు మృత్యుఒడికి..!
TAGGED:
srikakulam crime news