పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతినిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఏపీలో నదీ పర్యాటకం, ప్రయాణికుల భద్రత అంశంపై ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు.. బోటు ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. పర్యాటక పరంగా ఏ ఒక్కరూ నష్ట పోకూడదనే లక్ష్యం సహా ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు. నవంబర్ 7 నుంచి పాపికొండల్లో బోటింగ్‌కు అనుమతినిస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.