భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసుల దాడి, అక్రమంగా అరెస్టు నిరసిస్తూ... బీజేవైఎం ఆధ్యర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోగా... అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకొని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు - డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తల అరెస్టు
బీజేవైఎం ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని నారాయణగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్ మీద దాడి చేసిన సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం యత్నం.. అడ్డుకున్న పోలీసులు
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెరాస కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ మండిపడ్డారు. వెంటనే సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్