ఏపీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఏఎస్ఆర్ నగర్లో ఇళ్ల నిర్మాణం కోసం చేసిన నిరసనలో భాగంగా భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకమంతా రావాలి జగన్.. కావాలి జగన్ అన్నారని.. తాను కూడా ప్రచారంలో తెదేపాకు ఓటు వేయొద్దని.. తనకు ఓటు వేయకున్నా పర్లేదని చెప్పినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన మెజార్టీ రాగా సంతోషించానని చెప్పారు.
ఇప్పుడు జగన్ చేసే పనులు చూస్తే.. దారుణంగా ఉన్నాయని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.