Bandi Sanjay On Unemploy suicide: నిరుద్యోగులెవరూ ఇకపై ఆత్మహత్య చేసుకోవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కలిసి పోరాడుదామంటూ యువతకు సంజయ్ పిలుపునిచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదనే బాధతో ఖమ్మంలో నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య చేసుకోవడం దిగ్బ్రాంతి కలిగించిదన్నారు.
మృతుడు నవీన్ సోదరుడితో మాట్లాడి ఆత్మహత్యకు గల కారణాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. సాగర్ కుటుంబానికి అండగా ఉండాలని భాజపా శ్రేణులను సంజయ్ ఆదేశించారు. సాగర్ ఆత్మహత్య తన గుండెను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేసిన సంజయ్.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది నిరుద్యోగులు మనస్థాపంతో తనువుచాలిస్తున్నారని మండిపడ్డారు.
మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్(24) ఖమ్మంలోని ఓ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్‌సీసీ శిక్షణ పొంది ధ్రువపత్రం కూడా పొందాడు. మూడేళ్లుగా ఖమ్మంలోని ఓ శిక్షణా సంస్థలో ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా ఎంతకీ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. 'ఇగ నోటిఫికేషన్లు రావు.. పిచ్చి లేస్తుంది.. నా చావుకు కరోనా, సీఎం కేసీఆర్ కారణం' అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టినట్లు అతడి స్నేహితులు తెలిపారు. మంగళవారం ఉదయం ఖమ్మం మామిళ్ల గూడెం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై తలపెట్టి తానువు చాలించాడు. మృతుడి తల నుంచి మొండెం వేరుపడి ఉండగా... రైల్వే పోలీసులు గుర్తించారు. అన్నం సేవా సంస్థ సభ్యుల సాయంతో మార్చురీకి తరలించారు.
సంబంధిత కథనం: