తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన భాజపా ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విద్వేషపూరిత రాజకీయాలకు భాజపా దూరమన్న కిషన్ రెడ్డి... మేధావులు, విద్యావంతులు, రాజకీయ విశ్లేషకుల ఏకాభిప్రాయంతోనే జమిలి ఎన్నికలు సాధ్యమని అభిప్రాయపడ్డారు. కర్ణాటక రాజకీయాలపై స్పందిస్తూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే భాజపాను విమర్శించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతకుముందు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రాబోయే రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భాజపా ప్రకంపనలు: కిషన్ రెడ్డి
సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ భాజపా నినాదమని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగటం భాజపా విధానం కాదని స్పష్టం చేశారు.
kishan reddy