జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా ఆధ్వర్యంలో అల్వాల్ చౌరస్తాలో టీం సాయిబృందం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భాజపా ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనకు దిగిన భాజపా నాయకులను అరెస్ట్ చేసి.. బొల్లారం పీఎస్కు తరలించారు.
అల్వాల్లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
అల్వాల్లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి.. కేసులు పెడుతున్నదని భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లన్ని.. తెరాస కార్యాలయాలుగా మారాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నియతృత్వ ధోరణికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
- ఇదీ చదవండి :మధిరలో ప్రభుత్వాసుపత్రిలోకి మోకాలి లోతు వరద నీరు