తెలంగాణ

telangana

ETV Bharat / city

స్ట్రాటజిస్టుల అవసరం భాజపాకు లేదు : జీవీఎల్

Union Minsters Visit in AP: ఆంధ్రప్రదేశ్​లో కేంద్ర మంత్రులు పర్యటించానున్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో భాజపా సమర్థవంతంగా ఉందన్నారు. స్ట్రాటజిస్టుల అవసరం భాజపాకు లేదని ఎద్దేవా చేశారు.

bjp-mp-gvl-narasimha-rao-commented-on-politics-in-ap-and-telangana
bjp-mp-gvl-narasimha-rao-commented-on-politics-in-ap-and-telangana

By

Published : Apr 23, 2022, 8:43 PM IST

Union Minsters Visit in AP: ఆంధ్రప్రదేశ్​లో కేంద్ర మంత్రులు పర్యటించానున్నారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, జయశంకర్ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ విజయనగరం జిల్లాలో, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విశాఖపట్నం జిల్లాలో, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడప జిల్లాలో పర్యటించానున్నారు. విదేశాంగ, విద్యాశాఖల మంత్రుల పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయని తెలిపారు. కేంద్రం విస్తృతంగా సహాయం అందిస్తున్నా.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్రాన్ని విమర్శిస్తున్నాయన్నారు.

ఏపీ ప్రభుత్వం సబ్సిడీ బియ్యం ఎంత ఉచితంగా ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్​లో తానే ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరనున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యనికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందన్న జీవీఎల్.. కుటుంబ పార్టీల పాలన దూరం చేసేలా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని ఖరారు చేస్తారన్నారు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరడం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో భాజపా సమర్థవంతంగా ఉందన్నారు. స్ట్రాటజిస్టుల అవసరం భాజపాకి లేదన్న ఆయన బయటి వారిని తెచ్చుకుని రాజకీయ వ్యూహాలు రచించాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు.

యూపీఏ హయాంలో కంటే 8 రెట్లు ఇప్పుడే ఎక్కువగా తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తోందని జీవిఎల్ అన్నారు. కేటీఆర్ హద్దు మీరి మోదీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా అంటే భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details