తెలంగాణ

telangana

ETV Bharat / city

BJP leaders met governor : 'ఆ ఓటమిని జీర్ణించుకోలేకే రైతులపై కేసీఆర్ దాష్టీకం' - BJP leaders complain to tamilisai

రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను గవర్నర్‌కు వివరించామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్(BJP OBC national president Laxman) తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్‌(attack on bandi sanjay in nalgonda)పై దాడి ఘటన నిరసిస్తూ భాజపా నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను(BJP leaders met Governor tamilisai) కలిశారు. ఆ వ్యవహారంపై తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రైతుల కష్టాలను వివరించారు.

BJP leaders met governor
BJP leaders met governor

By

Published : Nov 16, 2021, 1:08 PM IST

Updated : Nov 16, 2021, 1:24 PM IST

ఆ ఓటమిని జీర్ణించుకోలేకే రైతులపై కేసీఆర్ దాష్టీకం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ కాన్వాయ్‌(attack on Bandi Sanjay in Nalgonda)పై దాడి ఘటన నిరసిస్తూ భాజపా నేతలు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌(BJP leaders met Telangana Governor)ను కలిశారు. నల్గొండ పోలీసుల వ్యవహారంపై కాషాయ బృందం ఫిర్యాదు చేసింది. ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గవర్నర్‌ను కలిసిన బృందంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(BJP national vice president DK aruna) సహా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్ పార్టీ నేతలు లక్ష్మణ్, గరికపాటి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఉన్నారు.

బంగాల్ తరహా రాజకీయం చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(BJP national vice president DK aruna) అన్నారు. భాజపా నేతలను రాష్ట్రంలో తిరగనివ్వమని స్వయంగా ఆయనే చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ తన స్థాయికి తగ్గ భాష వాడుతున్నారని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election)లో వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. కేసీఆర్ అబద్ధపు హామీలకు హుజూరాబాద్ ప్రజలు లొంగలేదని ఉద్ఘాటించారు.

"హుజూరాబాద్ ప్రజలు నిర్ణయాత్మక తీర్పునిచ్చి ఆదర్శంగా నిలిచారు. ఆ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్ ప్రజలకు ఏమీ చేయట్లేదు. రాజకీయాలల్లో హుందాతనం అవసరం. వర్షానికి ధాన్యమంతా నీటిపాలవుతోంది. రైతులు కుప్పల వద్దే కుప్పకూలుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఆయువు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా.. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ కేంద్రాలను ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి."

- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను గవర్నర్‌కు వివరించామని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్(BJP OBC national president Laxman) తెలిపారు. రాష్ట్రంలో క్రమంగా శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించేందుకు వెళ్లిన బండి సంజయ్‌పై దాడులు(Attack on Bandi sanjay in nalgonda) చేశారని వాపోయారు. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election) తర్వాత సీఎం(BJP fires on CM KCR) అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏడేళ్ల నుంచి రైతల వద్ద ప్రతి గింజను కొన్నది కేంద్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.

"గత నెల రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించట్లేదు. నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. కేంద్రంపై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రైతులకు అండగా భాజపా తరఫున పోరాడతాం. తెరాస తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదు."

- లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

Last Updated : Nov 16, 2021, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details