తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓటమి భయంతోనే భాజపాపై కేసీఆర్ విమర్శలు: డీకే అరుణ - aruna

ప్రధాని మోదీ గెలుపుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు భాజపా నేత డీకే అరుణ. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే భాజపాపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

dk aruna

By

Published : Jul 19, 2019, 5:59 PM IST

Updated : Jul 19, 2019, 9:09 PM IST

జ్యోతిష్యుడి మాటలు నమ్మి ప్రధాని అవుతానని దేశమంతా తిరిగినా ఫలితంలేకపోవడం వల్ల కేసీఆర్‌ నిరాశకు గురయ్యారని మాజీమంత్రి, భాజపా నేత డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధాని కాదు కదా కనీసం కుమార్తెను కూడా గెలిపించుకోలేకపోయారని అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకనే భాజపాపై, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ పార్టీకి భాజపానే ప్రత్యామ్నాయని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికలకు గడువు కావాలన్న కేసీఆర్... ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారని ఆరోపించారు.

ఓటమి భయంతోనే భాజపాపై కేసీఆర్ విమర్శలు: డీకే అరుణ
Last Updated : Jul 19, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details