తెలంగాణ

telangana

ETV Bharat / city

విద్యుత్​శాఖలో భారీ కుంభకోణం జరిగింది: లక్ష్మణ్

రాష్ట్ర విద్యుత్​ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. విద్యుత్​ కొనుగోళ్లపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

విద్యుత్​శాఖలో భారీ కుంభకోణం జరిగింది: లక్ష్మణ్

By

Published : Aug 22, 2019, 8:03 PM IST

దేశవ్యాప్తంగా సమగ్ర విద్యుత్‌ విధానం రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త నాటకాలకు తెరతీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్‌ సంస్కరణలు చేపట్టడం వల్లే 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్​ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని లక్ష్మణ్​ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యుత్‌ కొనుగోళ్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే అవినీతి పెరిగిపోయిందనడం సంతోషకరమన్నారు. లక్ష్మణ్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్‌, విజయపాల్​రెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌ నామాగౌడ్‌తో పాటు పలువురు భాజపాలో చేరారు.

విద్యుత్​శాఖలో భారీ కుంభకోణం జరిగింది: లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details