తెలంగాణ

telangana

ETV Bharat / city

బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం - బండి సంజయ్ తాజావార్తలు

సిద్దిపేటలో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా నాంపల్లిలోని భాజపా కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. యువకుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.

BJP Activist suicide attempt for Bandi Sanjay
బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 1, 2020, 4:32 PM IST

సిద్దిపేటలో ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టుకు నిరసనగా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట... ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడం వల్ల తీవ్రగాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన పోలీసులు స్థానికుల సహకారంతో మంటలు ఆర్పి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. 40శాతం కాలిన గాయాలతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెంకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు.

బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఇవీచూడండి:కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : లక్ష్మణ్

ABOUT THE AUTHOR

...view details