కరోనా బారినపడిన బిగ్‌బాస్ బ్యూటీ - కరోనా బారినపడిన బిగ్‌బాస్ బ్యూటీ
10:49 January 18
కరోనా బారినపడిన బిగ్‌బాస్ బ్యూటీ
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరూ ఈ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది సినీ తారలు ఈ మహమ్మారి బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ సిరి హన్మంతు కొవిడ్ కోరల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సిరి వెల్లడించింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు సిరి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.