జనవరి 13న తొలిసారిగా కొవాగ్జిన్ షిప్పింగ్ ప్రక్రియను దూరదృశ్యమాధ్యమంలో చూసిన తన కళ్లలో నీళ్లు తిరిగాయని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో 'సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్- ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్, రాచకొండ సీపీలతో కలిసి సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు.
కొవాగ్జిన్ షిప్పింగ్‌ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: సుచిత్ర ఎల్లా - covaxin news
తొలిసారి కొవాగ్జిన్ వాక్సిన్ షిప్పింగ్ రోజున తన రోమాలు నిక్కపొడుచుకున్న అనుభూతి కలిగిందని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో 'సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్- ఎస్సీఎస్సీ' 15 వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె నాటి గుర్తులను పంచుకున్నారు.
కొవాగ్జిన్ షిప్పింగ్‌ను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి: భారత్ బయోటెక్ జేఎండీ
షిప్పింగ్ రోజున తన రోమాలు నిక్కపొడుచుకున్న అనుభూతి కలిగిందని సుచిత్ర ఎల్ల అన్నారు. కొవాగ్జిన్ కోల్డ్ ట్రక్కులకు తెలంగాణ పోలీసులు విమానాశ్రయం వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారని గుర్తుచేశారు. తనతో సహా భారత్ బయోటెక్ బృందానికి అదో గొప్ప సంఘటనగా అభివర్ణించారు.