భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని సమస్త అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలపై మంగళవారం రాత్రి సమీక్షించారు. సీఎస్, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.
వెంటనే జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి... ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలివ్వాలని సీఎం తెలిపారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వర్షాల వల్ల వరదలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతుందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందన్నారు.