దేశ విదేశాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాండా రాజధాని కంపాలా (Bathukamma in Uganda)లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. "తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ ఉగాండా" ఆధ్వర్యంలో 'తిరుమల తిరుపతి దేవస్థానం- ఉగాండా' ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు చేపట్టారు. ఈ పండుగకి ప్రాంతాలకతీతంగా చాలా మంది మహిళలు , పురుషులు, పిల్లలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ..ఆటలాడుతూ... తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. రెండు గంటల పాటు సాగిన ఈ ఆటపాటల అనంతరం... బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో ఉంచి పోయిరావమ్మ... బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు.