లండన్‌లో చరిత్రాత్మక టవర్ బ్రిడ్జి వద్ద జరిగిన బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. కరోనా నేపథ్యంలో ఆ దేశ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో నిరాడంబరంగా ప్రవాస భారతీయ మహిళలు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ఫూర్తితో బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేయాలన్న ఆలోచనతో టాక్ మహిళలు బతుకమ్మ ఆటపాటలాడి ప్రత్యేక గౌరవం ఇచ్చారు.
"ప్రతి సంవత్సరం వందల మంది ఆడబిడ్డలతో ఎంతో ఆనందంగా బతుకమ్మ వేడుకల్ని జరుపుకుంటాం. ఇది సంబరాలకు సమయం కాకపోయినా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని మరువకుండా వినూత్నంగా బతుకమ్మ ఆట చూడడం చాలా గర్వంగా ఉంది. లండన్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోయినా బతుకమ్మలాడి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నందుకు కృతఙతలు."