జీఎస్టీపై బ్యాంక్ ఆఫ్ బరోడా అవగాహన ర్యాలీ
విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీపై అవగాహన కల్పించారు.
వస్తు సేవా పన్ను(జీఎస్టీ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు హైదరాబాద్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా... హిమాయత్‌నగర్ కూడలి నుంచి బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జనరల్ మేనేజర్ పి. శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ పన్ను సకాలంలో చెల్లించాలని... ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడకూడదని నినాదాలు చేశారు. జీఎస్టీపై ప్రజల్లో ఉన్న అపోహలు, సందేహలను తొలిగించేందుకు ఈ వారం రోజుల పాటు వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జీఎం శ్రీనివాస్ తెలిపారు.