తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్​.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ - సీఎం కేసీఆర్​కు బండి సంజయ్​ సవాల్​

వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

భాగ్యలక్ష్మి సాక్షిగా...
భాగ్యలక్ష్మి సాక్షిగా...

By

Published : Nov 20, 2020, 1:08 PM IST

Updated : Nov 20, 2020, 9:15 PM IST

భాగ్యలక్ష్మీ ఆలయానికి బండి సంజయ్​.. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

ముందుగా చెప్పినట్టుగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. వరద సాయం నిలిపివేయాలని భాజపా లేఖ రాసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. భాజపా లెటర్‌హెడ్‌, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారాయన. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదేనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులందరికీ సాయం అందించాకే ఎన్నికలకు వెళ్లాల్సిందని విమర్శించారు. వరదసాయం రూ.550 కోట్లలో సగం నిధులు తెరాస నాయకులే కాజేశారని ఆరోపించారు. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగా ఉన్నాయనే తప్పుడు ప్రచారానికి తెరలేపారని బండి విమర్శించారు.

ఇదీ చూడండి: బండి సంజయ్ సవాల్​తో పోలీస్ బందోబస్తు

Last Updated : Nov 20, 2020, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details