భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆగ్రహానికి గురయ్యారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లో ఎమ్మెల్సీ రామచందర్‌తో ఏర్పాటు చేసిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి సంజయ్ హాజరయ్యారు. పలువురు పేదలకు సరుకులు పంపిణీ చేశారు. నిత్యావసరాల కోసం చిన్నపాటి తోపులాటే జరగ్గా.. ప్రజలు భౌతిక దూరం పాటించాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఎంత చెప్పినా స్థానికులు మాట వినకపోయే సరికి ఎంపీ ఆగ్రహానికి గురయ్యారు. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బండి సంజయ్ ఆగ్రహం.. కార్యక్రమం మధ్యలోనే.. - నిత్యావసరాల పంపిణి
భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు చెప్పినా కొందిరిలో మార్పు రావడంలేదు. ఈ కారణమే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చిరాకు తెప్పించింది. మల్కాజ్‌గిరిలోని నిత్యవసరాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎంపీ స్థానికులను భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతకి వారు మాటవినలేదు. ఆగ్రహించిన సంజయ్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.
బండి సంజయ్ ఆగ్రహం