Telangana assembly sessions: ఏడు రోజులపాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో భేటీ అయిన బీఏసీ నిర్ణయం తీసుకొంది. బీఏసీ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్,ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, సీఎల్పీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
ఈనెల 15 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 8, 13 వ తేదీల్లో అసెంబ్లీ సెలవు ఉంటుందని బీఏసీ తెలిపింది. అయితే మరిన్ని ఎక్కువ రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని మజ్లిస్, కాంగ్రెస్ సభ్యులు కోరారు. కానీ ప్రభుత్వం మాత్రం 7 రోజుల పాటు నిర్వహణకే మొగ్గు చూపింది.