తెలంగాణ

telangana

గుడిలో బెల్టుషాపునకు వేలంపాట, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్

By

Published : Aug 27, 2022, 7:51 PM IST

Auction for belt shop సాధారణంగా గుడిలో వేలం పాట ప్రసాదానికో లేక పూజ చేసిన వాటి కోసమో నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం బెల్టు షాపునకు వేలం పాట పాడారు. దీని గురించి విన్న గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేలం పాటను అక్కడున్న వారు ఎవరో వీడియో తీశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Auction for belt shop
గుడిలో బెల్టుషాపుకు వేలంపాట

Auction for belt shop: ఏపీలో ఓ విచిత్రకరమైన సంఘటన జరిగింది. రేపల్లె తీర ప్రాంతలో ఓ గుడిలో వేలంపాట నిర్వహించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గుడిలో వేలంపాట నిర్వహించింది, ప్రసాదానికో, పూజలందుకున్న వస్తువులకో కాదు. బెల్టుషాపునకు. ఏపీలోని బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకె వానిదిబ్బ గ్రామంలో నాటుసారా విక్రయానికి, బెల్టుషాపు కోసం బహిరంగ వేలం నిర్వహించారు.

స్థానిక రాములవారి గుడిలో ఈ వేలం జరగ్గా అదే గ్రామానికి చెందిన వ్యక్తి 7 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. మద్యం అక్రమ అమ్మకాలకు వేలంపాటలు నిర్వహిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని భాజపా నాయకులు ఆరోపించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details