రాజధాని శివారు దుండిగల్‌లో ఎస్ఐపై దోపిడీ దొంగల దాడి యత్నం ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. దొంగల పక్కా ప్రణాళిక ప్రకారమే కారును దొంగిలించి.. చోరీకి వచ్చారని గుర్తించారు. చోరీకి యత్నంచిన దృశ్యాలు, అదే సమయంలో వచ్చిన ఎస్ఐ శేఖర్ రెడ్డిపై దాడికి యత్నంచిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఫుటేజ్‌లో దొంగలు ఎస్ఐపై కారు దూకించిన దృశ్యాలతో పాటు నిందితుల చిత్రాలు కనిపిస్తున్నాయి.
దొంగిలించిన కారులో చోరీ..!
సీసీటీవీ దృశ్యాల్లో వారు చోరీకి వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కారు చోరీ చేసిన దొంగలు.. అదే కారుతో తమను అడ్డుకున్న ఎస్ఐను గుద్ది చంపేందుకు యత్నించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు... యజమానిని విచారించారు. వాహనాన్ని ఎవరో దొంగిలించారని, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.