తెలంగాణ

telangana

ETV Bharat / city

balkampet yellamma: నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ఏర్పాట్లు పూర్తి

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహణకు... అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుండే ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని.. పదకొండున్నరకు అమ్మవారి కల్యాణం ఆలయం బయట షెడ్డు కింద నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

balkampet yellamma
balkampet yellamma

By

Published : Jul 13, 2021, 5:00 AM IST

బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహణకు... అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుండే ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని.. పదకొండున్నరకు అమ్మవారి కల్యాణం ఆలయం బయట షెడ్డు కింద నిర్వహిస్తామని చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కొవిడ్‌ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. అమ్మవారి కల్యాణాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం.. ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ప్రతియేటా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర జిల్లాలోని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన భాగ్యం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ ఏర్పాటు చేయాలని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించాం. కొవిడ్ నేపథ్యంలో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోడానికి రాలేకపోవచ్చు. కాబట్టి కల్యాణం ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు. - తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ మంత్రి.

ఇవాళ ఉదయం 11:11 గంటలకు నక్షత్రయుక్త కన్యా లగ్న సుముహూర్తంలో అమ్మవారి కల్యాణం, 14న దేవతా పూజలు, గణపతి హోమం, మహా శాంతి, చండీహోమం నిర్వహిస్తామని అన్నపూర్ణ తెలిపారు. సాయంకాలం పెద్దఎత్తున అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఎండోమెంట్​ అధికారి అన్నపూర్ణ తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య నిర్వహణ, శానిటైజేషన్ చేపట్టామని తెలిపారు.

లక్ష వాటర్ ప్యాకెట్స్...

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆదేశించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించాలని సూచించారు. అమ్మవారి కల్యాణ ఉత్సవాల ప్రారంభం నుంచి ముగిసే వరకు నీటి సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులకు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసేందుకు లక్ష వాటర్ ప్యాకెట్స్​ను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

అన్నదాన కార్యక్రమాలు...

భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి డ్రైనేజీ లీకేజీలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి చర్యల నియంత్రణపై నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

వైద్య శిబిరాలు...

మూడు రోజుల పాటు ఆలయ పరిసరాలలో భక్తుల రాకపోకలు ఉంటాయని, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టి ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలను అందించేందుకు మూడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి:BONALU: రాష్ట్ర సంస్కృతి చాటిచెప్పేలా పాతబస్తీ బోనాలు: తలసాని

ABOUT THE AUTHOR

...view details