తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం - 26 జిల్లాలకు ఎస్పీలు

IAS, IPS Transfers in AP: ఏపీలో భారీగా ఐఏఎస్​, ఐపీఎస్​ల బదిలీలు జరిగాయి. సోమవారం నుంచి 26 జిల్లాలు అమల్లోకి వస్తున్నందున కలెక్టర్లు, ఎస్పీలు సహా మరికొందరు ఐఏఎస్​లను ప్రభుత్వం వివిధ పోస్టుల్లో నియమించింది.

New Districts in ap
ap government

By

Published : Apr 3, 2022, 4:55 AM IST

IAS, IPS Transfers in AP: ఏపీలో కొత్త జిల్లాలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం రాత్రి భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసింది. 26 జిల్లాలకు కలెక్టర్లను, సంయుక్త కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురు తప్ప మిగతా 9 మందిని వారు పనిచేస్తున్న చోటే పాలనాధికారులుగా కొనసాగించింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా ఉన్న వివేక్‌ యాదవ్‌, నివాస్‌, ప్రవీణ్‌ కుమార్‌, హరికిరణ్‌లను రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేసింది.

ప్రస్తుతం జేసీలుగా, మున్సిపల్‌ కమిషనర్లుగా, వివిధ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారుల్లో కొందరిని జిల్లా కలెక్టర్లుగా నియమించింది. కొన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్లను వారు పనిచేస్తున్న చోటే కొనసాగించింది. ప్రస్తుతం జిల్లాల్లో జేసీ (హౌసింగ్‌), జేసీ (గ్రామ, వార్డు) సచివాలయాలకు పనిచేస్తున్న వారిలో పలువురిని కొత్త జిల్లాలకు జేసీలుగా నియమించింది. ఐఏఎస్‌ల బదిలీలపై శనివారం రాత్రి వెలువడిన ముసాయిదా జీవోల్లో ఆ వివరాలున్నాయి. బదిలీ అయినవారిలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులున్నారు. శనివారం అర్ధరాత్రి వరకూ ఏపీ ప్రభుత్వ గెజిట్‌లో జీవోల్ని అధికారికంగా అప్‌లోడ్‌ చేయలేదు. చివరి నిమిషంలో ఈ జాబితాలో కొన్ని మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.

ఇదీచూడండి:కరెంట్​ ఛార్జీలపై సీఎం జగన్​ అప్పుడేమో అలా... ఇప్పుడేమో!

ABOUT THE AUTHOR

...view details