తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. పలువురు అధికారుల గైర్హాజరు - ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజా వార్తలు

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు పలువురు అధికారులు గైర్హాజరయ్యారు. వీరిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ap-sec-conduct-video-conference-on-arrangements-for-panchayat-polls
ఏపీ ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. పలువురు అధికారుల గైర్హాజరు

By

Published : Jan 23, 2021, 7:24 PM IST

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు పలు జిల్లాలకు చెందిన అధికారులు హాజరు కాలేదు.

సర్వత్రా ఆసక్తి...

మరోవైపు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సాయంత్రం 5 గంటల వరకు అధికారులకు ఏపీ ఎస్​ఈసీ సమయం ఇచ్చింది. గైర్హాజరైన అధికారులపై ఆ రాష్ట్ర ఈసీ ఏం చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అధికారుల సహాయ నిరాకరణ అంశాన్ని ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అధికారుల సహాయ నిరాకరణతో ఈసీ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details