ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఎస్ఈసీని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఏలూరు ఓటర్ల జాబితా అంశంపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ఏలూరులో వార్డుల పునర్విభజనలోనూ అవకతవకలు జరిగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయమై మొత్తం 40కిపైగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మానం.. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఆదేశించింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు - ఏలూరు ఎన్నికలపై హైకోర్టు స్టే
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా అంశంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయండి: ఏపీ హైకోర్టు