ap high court on housemotion petitions: అత్యవసర సమయాల్లో విచారణ కోసం దాఖలు చేసే హౌస్‌మోషన్, లంచ్ మోషన్ పిటిషన్ల విషయంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతగా అత్యవసరంకాని వ్యాజ్యాలను కూడా అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరితే.. భవిష్యత్‌లో అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను తిరస్కరించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.
ఈనెల 24న కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆర్వోను ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి 23న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై అత్యవసరంగా (ap high court on lunchmotion petitions) లంచ్ మోషన్లో అప్పీల్ వేయడానికి అనుమతివ్వాలని హైకోర్టు ధర్మాసనం ముందు వైకాపా కౌన్సిలర్ల తరపున న్యాయవాది కోరారు. అందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి నిరాకరించింది.