ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడిచినందున తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు: ఏపీ హైకోర్టు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని.. కొత్త నోటిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. తాజా ప్రకటన చేయాలన్న వ్యాజ్యాలు తోసిపుచ్చిన న్యాయస్థానం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది.
పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు: ఏపీ హైకోర్టు
గతంలో నామినేషన్లు వేయనీయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.