AP govt circular on PRC Gos: పీఆర్సీ జీవోల విషయంలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నా.. ముందడుగే వేస్తోంది. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా జీతాలు,పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీకి అనుగుణంగానే జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని స్పష్టం చేసింది. జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేసే విధానాన్ని వివరిస్తూ ట్రెజరీ అధికారులకు, డీడీఓలను మరోసారి సర్క్యూలర్ జారీ చేసింది. ఓ వైపు పీఆర్సీ సాధన కమిటీతో ప్రభుత్వం చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆర్థికశాఖ సర్క్యూలర్ జారీ చేయడం గమనార్హం.
జోవోలు రద్దు చేస్తేన చర్చలు...
AP Employees Strike: మరోవైపుప్రభుత్వంతో చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. జీవోలు రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయిన నేతలు మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్చలకు వెళ్లాలా లేదా అన్న అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘ నేతలు మీడియాతో మాట్లాడారు.