AP Tenth Results 2022: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా పడింది. ఫలితాల విడుదలను విద్యాశాఖ అధికారులు సోమవారానికి(జూన్ 6కి) వాయిదా వేశారు. ఈ మేరకు ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఇవాళ ఉదయం 11 గం.కు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల కారణంగా ఫలితాల విడుదల వాయిదా వేశామని అధికారులు తెలిపారు. దీనికి తోడు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడంతో ఫలితాల విడుదలపై అధికారులు తర్జనభర్జన పడ్డారు.
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా - AP Tenth Results 2022 postponed
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల వాయిదా
11:43 June 04
ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారానికి వాయిదా
కాగా ఏపీ కేబినెట్‌లో శాఖల మార్పు తర్వాత విద్యాశాఖ ద్వారా ప్రకటిస్తున్న తొలి ఫలితాలు ఇవే. విద్యాశాఖ సమన్వయ లోపమే ఫలితాల వెల్లడి జాప్యానికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం సుమారు 6 లక్షలమంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు.
ఇవీ చదవండి:మధ్యాహ్నం కేసీఆర్తో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ భేటీ
దేశంలో తొలి మిర్రర్ టెలిస్కోపు.. ఆసియాలోనే పెద్దది.. ప్రపంచంలో ప్రథమం!
Last Updated : Jun 4, 2022, 12:18 PM IST